జగన్ కు అవగాహన లేదు, నేను చెబితే వినడు: చంద్రబాబు

  • జగన్ వైఖరితో రావాల్సిన పెట్టుబడులు రావడం లేదు
  • అమరావతిలో పనులు ఆగిపోయాయి
  • వ్యూహ కమిటీలతో టెలీకాన్ఫరెన్స్ లో బాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి వల్ల రావాల్సిన పెట్టుబడులు రావడం లేదని, వచ్చిన పెట్టుబడులు సైతం వెనక్కు పోతున్నాయని, ఈ కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయని విపక్ష నేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం టీడీపీ వ్యూహ కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, పోలవరం పనులు ఆగిపోయాయని, అమరావతిలో పనులు ఒక్క అడుగు కూడా పడటం లేదని ఆరోపించారు.

 జగన్ కు అవగాహన లేదని, తాను చెప్పాలని చూస్తే వినడం లేదని అన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కే పని అసెంబ్లీలో జరుగుతోందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగానితనంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. అన్ని జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేల వ్యక్తిత్వాన్ని కించబరిచేలా అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Tele Conference
Jagan

More Telugu News